Home > తెలంగాణ > రాహుల్ గాంధీకి అసదుద్దీన్ ఒవైసీ సవాల్..

రాహుల్ గాంధీకి అసదుద్దీన్ ఒవైసీ సవాల్..

రాహుల్ గాంధీకి అసదుద్దీన్ ఒవైసీ సవాల్..
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని అన్నారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. పీవీ నరసింహారావు హయాంలో 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతపై కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఆయన ఈ కామెంట్లు చేశారు.

పెద్ద పెద్ద ప్రకటనలు చేసే రాహుల్ గాంధీ వాయనాడ్ ను వదిలి హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని ఛాలెంజ్ చేస్తున్నానని ఒవైసీ అన్నారు. రాహుల్ మైదానంలోకి దిగి తనపై పోటీ చేయాలని అన్నారు. కాంగ్రెస్ నేతలు చాలా ఎన్నో మాటలు చెబుతారని, తాను దేనికైనా సిద్ధమని చెప్పారు. బాబ్రీ మసీదు, సెక్రటేరియట్ మసీదును కాంగ్రెస్ హయాంలోనే కూల్చివేశారని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రాహుల్ గాంధీ కామెంట్ చేసిన కొన్ని గంటల్లో ఒవైసీ ఈ సవాలు విసరడం విశేషం. ఇదిలా ఉంటే ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన వ్యాఖలను అసదుద్దీన్ తీవ్రంగా ఖండంచారు. పార్లమెంటులో ముస్లింల మూక హత్యలు జరిగే రోజు ఎంతో దూరంలో లేవని అన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదం చెప్పే ప్రధాని మోడీ డానిష్ అలీ ఘటనపై ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ఒవైసీ ప్రశ్నించారు.

Updated : 25 Sept 2023 9:24 AM IST
Tags:    
Next Story
Share it
Top