Home > తెలంగాణ > ప్రజాపాలన దరఖాస్తు ఫారాలు ఉర్దూలోనూ ఉండాలి : ఓవైసీ

ప్రజాపాలన దరఖాస్తు ఫారాలు ఉర్దూలోనూ ఉండాలి : ఓవైసీ

ప్రజాపాలన దరఖాస్తు ఫారాలు ఉర్దూలోనూ ఉండాలి : ఓవైసీ
X

తెలంగాణలో రేపటి నుంచి ప్రజాపాలన కార్యక్రమానికి కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం చుట్టంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు గురువారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారెంటీల లోగో, దరఖాస్తు ఫారంను సీఎం రేవంత్ రిలీజ్ చేశారు. అయితే ఈ దరఖాస్తు ఫారాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్ర‌జాపాల‌న ద‌ర‌ఖాస్తులు ఉర్దూ భాష‌లోనూ ఉండాల‌ని అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞ‌ప్తి చేశారు. ఉర్దూలో అందుబాటులోకి తేవాల‌ని సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారిని కోరుతున్నట్లు చెప్పారు. అంద‌రూ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుని ల‌బ్ది పొందాల‌న్న ఒవైసీ.. దానికి అనుగుణంగా ప్రభుత్వం ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించాల‌ని సూచించారు.

కాగా డిసెంబరు 28 నుంచి గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్‌ వార్డుల్లో మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. 8 పనిదినాల్లో గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందించాలని నిర్ణయించామన్న సీఎం.. జనవరి 7లోపు లబ్ధిదారుల వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి న్యాయం చేసేందుకు కృషి చేస్తోందని చెప్పారు.

Updated : 27 Dec 2023 9:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top