Home > తెలంగాణ > ముస్లిం వివాహ చట్టం రద్దు..అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం

ముస్లిం వివాహ చట్టం రద్దు..అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం

ముస్లిం వివాహ చట్టం రద్దు..అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం
X

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) చట్టాన్ని తీసుకరావాలనే దిశగా మొదటి అడుగు వేసింది. ముఖ్యమంత్రి హిమంత శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం వివాహ , విడాకుల నమోదు చట్టం 1935ని రద్దు చేయాలని నిర్ణయించింది. అస్సాం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉమ్మడి పౌరస్మృతి అమలు దిశలో తీసుకున్న మొదటి అడుగుగా పరిగణిస్తున్నారు. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇకపై ముస్లింల పెళ్లీలు, విడాకుల నమోదును జిల్లా కమిషనర్, జిల్లా రిజిస్ట్రార్ చేపడతారని మంత్రి వివరించారు.

94 మంది ముస్లిం రిజిస్ట్రార్లకు ఒక్కొక్కరికి ఏకమొత్తంలో రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి విధుల నుంచి తొలగిస్తామని ప్రకటించారు. కాగా ముస్లిం వివాహ చట్టం రద్దుతో సంబంధిత అంశాలు ప్రత్యేక వివాహ చట్టం పరిధిలోకి రానున్నాయి. యూసీసీని సాధించే దిశగా ఇదొక ముందడుగు అని ఆ రాష్ట్ర మంత్రి జయంత మల్లబారువా వ్యాఖ్యానించారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. యూసీసీ అమలు దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం బిశ్వశర్మ ఇటీవలే ప్రకటించారని, ఈ ప్రయత్నంలో చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల ప్రారంభంలో, యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును ఆమోదించిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. వివాహం, విడాకులు, వారసత్వం, లివ్-ఇన్ సంబంధాలను నియంత్రించే పాత వ్యక్తిగత చట్టాలను భర్తీ చేయడానికి బిల్లు ప్రయత్నిస్తుంది.

Updated : 24 Feb 2024 4:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top