Home > తెలంగాణ > పార్ట్‌నర్స్‌ భారీ స్కెచ్‌.. ఓనర్‌ హత్యకు సుపారీ

పార్ట్‌నర్స్‌ భారీ స్కెచ్‌.. ఓనర్‌ హత్యకు సుపారీ

కోదాడలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఇంజనీరింగ్ కాలేజ్‌ ఓనర్‌పై హత్యాయత్నం జరగగా.. కాలేజ్‌లో అతని పార్ట్‌నర్స్‌ సుపారీ ఇచ్చినట్టుగా తేలింది. వివరాలు.. సూర్యాపేట జిల్లాలోని కోదాడలో ఉన్న గేట్ ఇంజనీరింగ్ కాలేజ్(గేట్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్)‌కు కాంతారావు ఓనర్‌గా ఉన్నారు. అయితే కాంతారావుపై తాజాగా హత్యాయత్నం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారును డీసీఎంతో ఢీకొట్టి హత్య చేయాలని కొందరు వ్యక్తులు యత్నించారు. ప్లాన్‌లో భాగంగా తొలుత కాంతారావు కారును మునగాల మండలం మద్దెలచెరువు వద్ద కారును ఢీకొట్టేందుకు ప్రయత్నం చేశారు. అయితే కాంతారావు తప్పించుకున్నారు.

ఆ తర్వాత కోదాడలో కాంతారావు కారును డీసీఎంతో ఢీకొట్టారు. ఈ ప్రమాదం నుంచి కాంతారావు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తర్వాత ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే షాకింగ్ ‌నిజాలు వెలుగులోకి వచ్చాయి. కాంతారావు హత్య కోసం రూ.50 లక్షలు ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్‌తో ఆయన పార్ట్‌నర్స్‌ ఒప్పందం చేసుకున్నట్టుగా తేలింది. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌కు అడ్వాన్స్‌గా రూ. 5 లక్షలు చెల్లించినట్టుగా గుర్తించారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ ఘటనపై కాంతారావు స్పందిస్తూ.. తన కారు డ్రైవర్ అప్రమత్తతోనే ప్రమాదం నుంచి బయటపడినట్టుగా తెలిపారు.

Updated : 22 Jun 2023 6:51 AM GMT
Tags:    
Next Story
Share it
Top