Home > తెలంగాణ > సాయన్నకు అసెంబ్లీ నివాళి.. రేపటికి వాయిదా

సాయన్నకు అసెంబ్లీ నివాళి.. రేపటికి వాయిదా

సాయన్నకు అసెంబ్లీ నివాళి.. రేపటికి వాయిదా
X

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజున కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు శాసన సభ నివాళి అర్పించింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశఆరు. అనంతరం సాయన్నతో అనుబంధాన్ని శాసనసభ్యులు గుర్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ అభివృద్ధికి సాయన్న ఎంతో కృషి చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయనతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని, నిత్యం ప్రజలతో మమేకమై నిరాబండబరంగా ఉండేవారని గుర్తు చేశారు. అట్టడుగు వర్గం నుంచి వచ్చిన వచ్చిన సాయన్న మన మధ్య లేకపోవడం బాధాకరమని కేసీఆర్ అన్నారు.





సాయన్న నాలుగు దశాబ్దాల పాటు శాసన సభ్యుడిగా, అనేక హోదాల్లో పని చేశారని కేసీఆర్ అన్నారు. ఎలాంటి సందర్భంలోనైనా చిరునవ్వుతో చాలా ఓపికతో ఉండేవారని, అందరితో కలుపుగోలుగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను సీఎం బాధ్యతలు చేపట్టాక జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ను విలీనం చేసేందుకు ఎనలేని కృషి చేశారని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల కంటోన్మెంట్లను మున్సిపాలిటీల్లో కలపాలన్న ఆలోచన చేస్తోందని, ఇలాగైనా సాయన్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నానని కేసీఆర్ అన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో పుట్టి జీహెచ్‌ఎంసీలో సెటిలైన సాయన్న వివాదరహిత నేతల్లో ఆయన ఒకరని, ఆయన కూతురు సైతం కార్పొరేటర్‌గా సేవలందించారని అన్నారు.




Updated : 3 Aug 2023 12:49 PM IST
Tags:    
Next Story
Share it
Top