Home > తెలంగాణ > ఈ నెల 20కి అసెంబ్లీ వాయిదా

ఈ నెల 20కి అసెంబ్లీ వాయిదా

ఈ నెల 20కి అసెంబ్లీ వాయిదా
X

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 20కి వాయిదా వేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ప్రసంగంపై ఇవాళ వాడీవేడిగా చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల పంచ్ డైలాగులు, మాటల తూటాలతో అసెంబ్లీ హీటెక్కింది. ప్రసంగాన్ని మొదలు పెట్టిన మాజీ మంత్రి, కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడగా.. కేటీఆర్ మాటలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అప్పుల పాలైందని సీఎం ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ మరో నేత హరీశ్ రావు మాట్లాడుతూ.. సభలో మాట్లాడకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు.

తమ ప్రభుత్వ హయాంలో ఐదుగురు సభ్యులున్నా కాంగ్రెస్ పార్టీ సభ్యులకు మాట్లాడటానికి చాలా సమయం ఇచ్చామని, తాము 39 మంది ఉన్నప్పటికీ తమకు అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. మాట్లాడమంటే మాట్లాడుతామని, లేకుంటే సభ నుంచి వాకౌట్ చేస్తామని హరీశ్ రావు అన్నారు. హరీశ్ రావు మాట్లాడుతున్న క్రమంలోనే మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈక్రమంలోనే సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. చివరికి గవర్నర్ ప్రసంగానికి అధికార సభ్యులు ఆమోదం తెలపగా.. సమావేశాలను ఈ నెల 20కి వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.

Updated : 16 Dec 2023 7:09 PM IST
Tags:    
Next Story
Share it
Top