ఓట్ తెలంగాణ - Live Updates
X
తెలంగాణ ఓట్ల పండుగ కీలక ఘట్టానికి చేరుకుంది. 119 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదింటి వరకు కొనసాగింది. పోలింగ్ సమయం ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం ఇచ్వ్వచారు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బరిలో ఉన్న 2290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కర్నాటక అసెంబ్లీ ఫలితాలు ఇచ్చిన జోష్తో జోరుమీదున్న కాంగ్రెస్ విజయంపై ధీమాతో ఉంది. ఇక డబుల్ ఇంజిన్ సర్కారు నినాదంతో ముందుకెళ్తున్న బీజేపీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని కంకణం కట్టుకుంది.
ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
స్వల్ప ఘటనలు మినహా 119 నియోజకవర్గాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
పోలింగ్ సమయం ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చిన అధికారులు
కొద్ది గంటలే ఉన్నాయి.. వెళ్లి ఓటేయండి - స్మితా సభర్వాల్
సీఎంఓ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ స్మితా సభర్వాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ‘ఎంత బిజీగా వున్నా సరే.. వెళ్లి ఓటేయండి.. ఇంకా కొద్ది గంటలే మిగిలి ఉంది’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
కమలాపూర్‌లో ఓటేసిన ఈటల
మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కమలాపూర్‌లో ఓటేశారు. సతీమణితో కలిసి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
వికారాబాద్లో నిలిచిపోయిన పోలింగ్
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గిర్మాపూర్ గ్రామంలో నిలిచిపోయిన పోలింగ్
బ్యాలెట్ బాక్స్ను తిరగేసి పెట్టారని గ్రామస్తుల ఆరోపణ
పోలింగ్‌ను అడ్డుకున్న స్థానిక నాయకులు
ఎగ్జిట్‌పోల్స్‌పై ఈసీ కీలక ప్రకటన
సాయంత్రం 5.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకునేందుకు అనుమతించిన ఎలక్షన్ కమిషన్
ములుగు నియోజకవర్గం ములుగు మండలం జగ్గన్నపేటలో ఓటు వేసిన సీతక్క
ఓటు వేసిన కాంగ్రెస్ నేత అప్పిరెడ్డి
సూర్యాపేట జిల్లా కోదాడలో కుటుంబ సభ్యులతో కలసి ఓటు వేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత, సినీ నిర్మాత అన్నపురెడ్డి అప్పిరెడ్డి
ఓటు వేసిన సీఎం కేసీఆర్
సిద్దిపేట జిల్లా చింతమడకలో ఓటు వేసిన కేసీఆర్ దంపతులు.
ఓటేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ పట్టణం నయనగర్ పోలింగ్ బూత్ నెంబర్ 182లో ఓటు వేసిన హుజుర్ నగర్,కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని బూత్ నంబర్ 248లో ఓటు హక్కు వినియోగించుకున్న బండ్ల గణేష్
తెలంగాణలో ఉదయం 11 గంటలకల్లా 20శాతం ఓటింగ్ నమోదు
జీవితాలను మార్చే ఆయుధం ఓటు - షర్మిల
ఎమ్మెల్యే కాలనీలోని 159 పోలింగ్ బూత్లో ఓటు వేసిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి
అందరూ బాధ్యతగా ఓటేయండి - రేవంత్‌రెడ్డి
కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్యే అభ్యర్థి రేవంత్‌రెడ్డి
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఓటేయాలని పిలుపు
పౌరుడిగా నా బాధ్యత నిర్వర్తించా - కేటీఆర్
బంజారాహిల్స్ నందినగర్‌లోని పోలింగ్ బూత్‌లో భార్యతో కలిసి వెళ్లి ఓటు వేసిన కేటీఆర్
ఓటేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండలోని పోలింగ్ సెంటర్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఓటేసిన బండి సంజయ్
కరీంనగర్ సాధన స్కూల్ పోలింగ్ సెంటర్కు కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు వేసిన బండి సంజయ్. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు.
ఓటు వేసిన హరీశ్ రావు
సిద్దిపేట అంబిటస్ స్కూల్ 114 పోలింగ్ స్టేషన్లో మంత్రి హరీశ్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. హరీశ్ రావు సతీమణి శ్రీనిత, కొడుకు అర్చిస్ మాన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
వెలవెలబోతున్న వరిపేట పోలింగు కేంద్రం
గ్రామాన్ని గ్రామపంచాయతీగా మార్చకపోవడాన్ని నిరసిస్తూ బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలం వరిపేట గ్రామానికి చెందిన ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. ఉదయం 9.30గంటల వరకు కేవలం 12 మంది ఓటర్లు మాత్రమే ఓటు వేశారు.
రంగారెడ్డి జిల్లాలో నియోజకవర్గాలవారీగా ఉ. 9 గంటల వరకు పోలింగ్ శాతం
ఇబ్రహీంపట్నం: 8.11శాతం
ఎల్బీనగర్: 5.6శాతం
మహేశ్వరం: 5శాతం
రాజేంద్రనగర్: 15శాతం
శేరిలింగంపల్లి: 8శాతం
చేవెళ్ల (ఎస్సీ): 5శాతం
కల్వకుర్తి: 5శాతం
షాద్‌నగర్: 7.2శాతం
శేరిలింగంపల్లి కొండాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్
ఓటు హక్కు వినియోగించుకున్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
షేక్‌పేట ఇంటర్నేషనల్ స్కూల్లో సతీమణి రమతో కలిసి ఓటేసిన రాజమౌళి
జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న హీరో నితిన్
ఓటు వేసిన బర్రెలక్క
నాగర్‌కర్నూల్ కొల్లాపూర్‌లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న కర్నె శిరీషా అలియాస్ బర్రెలక్క
ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ : సీఈఓ వికాస్‌రాజ్
ఈవీఎంలు మొరాయిస్తున్న చోట మరమ్మతులు చేస్తున్నాం.
యువత తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా ఓటర్లు తమ పోలింగ్ బూత్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.
ఓటు హక్కు ను వినియోగించుకున్న జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ అజహరుద్దీన్
ఎమ్మెల్సీ కవితపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేసిన కవిత.
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఈసీకి కాంగ్రెస్ కంప్లైంట్
ఓటర్లకు పోలీసుల సూచనలు
ఓటేసిన జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో బూతు నెంబర్ 95 లో ఓటు వేసిన సూర్యాపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి జగదీశ్ రెడ్డి, కుటుంబ సభ్యులు
ఓటేసిన మెగా ఫ్యామిలీ
జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు
మణికొండలో ఓటేసిన హీరో వెంకటేష్
ఓటు హక్కు వినియోగించుకున్న వికాస్ రాజ్
సనత్ నగర్ నియోజకవర్గం అమీర్ పేట్ డివిజన్ ఎస్ ఆర్ నగర్ లోని మోడల్ పోలింగ్ స్టేషన్ బూత్ 188లో ఓటు వేసిన సీఈఓ వికాస్ రాజ్ దంపతులు
ఓటు వేసిన పొన్నం ప్రభాకర్.
బోయినపల్లిలో ఓటేసిన మంత్రి మల్లారెడ్డి
సిద్ధిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
ఉప్పల్లో మొరాయించిన ఈవీఎం
చిలుకానగర్ సెయింట్ మార్క్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో మొరాయించిన ఈవీఎంలు
పోలింగ్ బూత్ నెంబర్ 380 లో పనిచేయని ఈవీఎం
గంట దాటినా ఇంకా ప్రారంభంకాని పోలింగ్
ఓటేసిన కిషన్‌రెడ్డి
అంబర్‌పేట పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కపల్లి లో ఓటు హక్కును వినియోగించుకున్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి
ఓటు వేసిన ఎన్టీఆర్
ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినితో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఓటు వేసిన సుమంత్
హైదరాబాద్ బంజారాహిల్స్ BSNL పోలింగ్ సెంటర్లో ఓటు వేసిన హీరో అల్లు అర్జున్
ఓటు వేసిన ఎమ్మెల్సీ కవిత
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కును వినియోగించుకున్న కవిత
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి - కేటీఆర్
మాదాపూర్ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ పోలింగ్ స్టేషన్లో సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్
అందరూ ఓటు వేయండి.. ప్రధాని మోడీ ట్వీట్
రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలి. యువత ముఖ్యంగా తొలిసారి ఓటు వచ్చిన వారు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి - ప్రధాని మోడీ
కూకట్ పల్లి బూత్ నంబర్ 12లో ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు
నిజామాబాద్లో ప్రారంభమైన పోలింగ్
ఆదర్శ మహిళా పోలింగ్ కేంద్రంలో పవర్ సప్లై లేక ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం.
రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ప్రారంభమైన పోలింగ్
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.26కోట్లు
పురుష ఓటర్లు - 1,62,98,418
మహిళా ఓటర్లు - 1,63,01,705
థర్డ్ జెండర్ ఓటర్లు - 2,౬౭౬
రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు - 35,356
12 వేలకుపైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్
7,571 చోట్ల పోలింగ్ స్టేషన్ల బయట సీసీ కెమెరాలు
రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు