Home > తెలంగాణ > పీకల దాకా తాగి ఆఫీసుకు.. కలెక్టర్కు దొరకడంతో..

పీకల దాకా తాగి ఆఫీసుకు.. కలెక్టర్కు దొరకడంతో..

పీకల దాకా తాగి ఆఫీసుకు.. కలెక్టర్కు దొరకడంతో..
X

గవర్నమెంట్ జాబ్ అంటే పేరంటానికి వెళ్లి రావడం అనుకున్నాడో ప్రభుత్వం ఉద్యోగి. అలా, రోజూ తాగి ఆఫీస్ కు వెళ్లి, విధులు నిర్వహించకుండా టైం పాస్ చేసేవాడు. విషయం తెలిసిన జిల్లా కలెక్టర్.. అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని జాబ్ నుంచి సస్పెండ్ చేశాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆఫీస్ సముదాయంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి ఆఫీస్ లో ఏఎస్ డబ్య్లూవోగా పని చేస్తున్న సేవ్యానాయక్.. మద్యానినకి బానిసై రోజు తాగి ఆఫీస్ కు వచ్చేవాడు. ఎంట్రీ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వడం లేదని ఫిర్యాదులు అందటంతో.. విషయం తెలుసుకున్న కలెక్టర్ తేజస్ నందలాల్ సేవ్యానాయక్ ఆఫీస్ కు వెళ్లి తనికీలు చేశాడు. తర్వాత బ్రీతింగ్ టెస్ట్ చేయడా తాగి ఉన్నట్లు రుజువయింది. దాంతో స్పాట్ లోనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.







Updated : 8 July 2023 8:46 AM IST
Tags:    
Next Story
Share it
Top