Home > తెలంగాణ > గద్దర్ అంత్యక్రియల వేళ చెలరేగిన వివాదం.. అగౌరవ పరిచారంటూ..

గద్దర్ అంత్యక్రియల వేళ చెలరేగిన వివాదం.. అగౌరవ పరిచారంటూ..

గద్దర్ అంత్యక్రియల వేళ చెలరేగిన వివాదం.. అగౌరవ పరిచారంటూ..
X

ప్రజా యుద్ధనౌక గద్దర్ తెలంగాణ ఉద్యమానికి చేసిన కృషికి గౌరవ సూచకంగా.. ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనిపై వివాదం నెలకొంది. ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు జరపడంపై యాంటీ టెర్రరిజం ఫోరం (ATF) అభ్యంతరం వ్యక్తం చేసింది. గద్దర్ అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో చేయడం పోలీస్ అమరవీరులను అగౌరవ పరచడమేనని ఏటీఎఫ్ పేర్కొంది.

నక్సలైట్ వ్యతిరేక పోరాటంలో అమరులైన పోలీసుల త్యాగాలను అవమానిండమేనని తెలిపింది. గద్దర్ తన విప్లవ పాటలతో వేలాది మంది యువతను నక్సలిజం వైపు మళ్లించారు. వాళ్లవల్ల వేలాది మంది పోలీసులు బలైపోయారు. అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం.. పోలీసు బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమేనని ఏటీఎఫ్ కన్వీనర్ శశిధర్ అన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

దారులన్నీ ఆయన వైపు:

ఈ క్రమంలో గద్దర్ అంతిమయాత్రకు హైదరాబాద్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అల్వాల్ లో ఆయన స్థాపించిన మహాబోధి విద్యాలయంలో ప్రభుత్వ అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో దారులన్నీ నగరం వైపు మళ్లాయి. ఆయనను కడసారి చూసేందుకు అన్ని జిల్లాల నుంచి అభిమానులు, రాజకీయ నేతలు ఎల్బీస్టేడియానికి తరలివస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల గన్ పార్క్, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్థూపం, ట్యాంక్ బండ్ మీదుగా అంతిమయాత్ర కొనసాగనుంది.

Updated : 7 Aug 2023 1:13 PM IST
Tags:    
Next Story
Share it
Top