MLC Kavita : అయోధ్య రామ ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం అందలేదు : ఎమ్మెల్సీ కవిత
X
శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు తమకు ఆహ్వానం అందలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. రాముడు అందరివాడని కొందరివాడు కాదన్నారు. ఏదోక రోజు అయోధ్యని సందర్శిస్తామని ఆమె అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో జ్యోతీరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కవిత అన్నారు. ఆధునిక భారత దేశంలో పునరుజ్జీవన ఉద్యమ పితామహుడిగా మహాత్మా జ్యోతీరావు పూలే కృషి చిరస్మరణీయమన్నారు. ఈ మేరకు కవిత
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.
అణగారిన వర్గాలు, మహిళల పట్ల వివక్షకు చరమగీతం పాడుతూ ఈ దేశంలో సామాజిక సమానత్వానికి బాటలు వేసిన ఆద్యులని కొనియాడారు. వివక్షకు గురైన వర్గాల గుడిసెల్లో అక్షర దీపాలు వెలిగించిన కాంతిరేఖ పూలే అని వ్యాఖ్యానించారు. గతంలో జాగృతి నేతృత్వంలో జరిగిన ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీ ప్రాంగణంలో డా.అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు జరిగిందని గుర్తు చేశారు. ఇది అందరికీ గర్వకారణమని చెప్పారు. సమానత్వ స్ఫూర్తిని అనునిత్యం చట్టసభల స్మృతిపథంలో నిలిపే సదుద్దేశంతో మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహ ఏర్పాటు కూడా తెలంగాణ అసెంబ్లీలో జరగడం అవసరమన్నారు.