Home > తెలంగాణ > Prameela Rani : ఛాన్స్ అడిగితే.. గెస్ట్ హౌస్కు రమ్మన్నారు.. ‘బాహుబలి బామ్మ’

Prameela Rani : ఛాన్స్ అడిగితే.. గెస్ట్ హౌస్కు రమ్మన్నారు.. ‘బాహుబలి బామ్మ’

Prameela Rani : ఛాన్స్ అడిగితే.. గెస్ట్ హౌస్కు రమ్మన్నారు.. ‘బాహుబలి బామ్మ’
X

సినిమా ఇండస్ట్రీ ఒక ఓపెన్ సీక్రెట్. పైకి చూడటానికి కలర్‌ఫుల్‌ కనిపించినా.. లోపల చాలా జరుగుతుంటాయి. అందులో లేడీ యాక్టర్ల పరిస్థితి మరీ దారుణం. ముఖ్యంగా ఛాన్సుల కోసం ప్రయత్నించే వాళ్లు.. చాలా ఇబ్బందులకు పడుతుంటారు. ట్యాలెంట్ ఉన్నా.. కొన్ని పరిస్థితులు వారిని వెంటాడుతుంటాయి. అలాంటి ఘటనే తన జీవితంలోనూ జరిగిందని సీనియర్ నటి ప్రమీలా రాణి చెప్పుకొచ్చింది. తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాదితురాలేనని, ఛాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి గెస్ట్ హౌస్‌కి రమ్మన్నారని ఆవేదన వ్యక్తం చేసింది.





కృష్ణా జిల్లాలో పుట్టిన ప్రమీల.. దాదాపు 45 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలోనే ఉంది. అప్పట్లో సహాయక పాత్రలు చేసేది. తాజాగా అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి తెలుగు స్టార్ హీరోలకు బామ్మగా నటించి మెప్పించింది. బాహుబలి, విక్రమార్కుడులో చేసిన రోల్ కు చాలా గుర్తింపు లభించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రమీల.. తనకు ఎదురైన చేదు అనుభవాల్ని పంచుకుంది. ‘చిన్న వయసులోనే పెళ్లి చేశారు. నాకు పిల్లలు పుట్టరని తెలిసి.. కొంతకాలానికి భర్త వదిలేసి వెళ్లిపోయాడు. కొన్నాళ్లకు తల్లిదండ్రులు రెండో పెళ్లి చేశారు. 23 ఏళ్లప్పుడు రెండో భర్త చనిపోయాడు. అప్పటి నుంచి ఒంటిరిగానే ఉన్నా. కుటుంబ పోషనకు సినిమాల్లోకి వెళ్లా. కానీ ఓ వ్యక్తి సినిమాలో అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి.. గెస్ట్ హౌస్ కు రమ్మని పిలిచాడు. దానికి ఒప్పుకోకపోయే సరికి ఆ సినిమాలో చాన్స్ పోయింది. అది తప్ప ఇంకెవరు నాతో అలా ప్రవర్తించలేదు’అని చెప్పుకొచ్చింది.






Updated : 4 Oct 2023 8:33 PM IST
Tags:    
Next Story
Share it
Top