Home > తెలంగాణ > Babu Mohan : కేఏ పాల్ పార్టీలో చేరిన బాబు మోహన్.. వరంగల్ లోక్ సభకు పోటీ

Babu Mohan : కేఏ పాల్ పార్టీలో చేరిన బాబు మోహన్.. వరంగల్ లోక్ సభకు పోటీ

Babu Mohan : కేఏ పాల్ పార్టీలో చేరిన బాబు మోహన్.. వరంగల్ లోక్ సభకు పోటీ
X

మాజీ మంత్రి ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ ప్రజా శాంతి పార్టీలో చేరారు. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన ఆయన కేఏ పాల్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ప్రజా శాంతి పార్టీ తరుపున వరంగల్ లోక్ సభకు పోటీ చేసే అవకాశం ఉంది. 2014లో ఆందోల్ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలుపోందారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ బాబు మోహన్‌కు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన బీజేపీలో చేరారు. 2018, 2023లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆందోల్ సీటు కేటాయింపులో బీజేపీ మొదట బాబు మోహన్‌ కొడుకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆ ఎన్నికల్లో బాబు మోహన్ ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలోనే ఎన్నికల తర్వాత ఇటీవలె.. బీజేపీపై, బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించిన బాబు మోహన్.. ఎట్టకేలకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ప్రజాశాంతి పార్టీ కండువా కప్పుకున్నారు.





తన జీవితంలో ఒక్కసారైనా వరంగల్ నుంచి ఖచ్చితంగా లోక్‌సభకు పోటీ చేస్తానని.. ఎంపీగా గెలుస్తానని బాబు మోహన్ గతంలో చెప్పారు. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు పార్టీ మారడం ఆ వ్యాఖ్యలకు బలం చేకూరింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని బాబు మోహన్ భావిస్తున్నా.. టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతోనే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కంపు నుంచి బయటకి రావాలనుకున్నా.. వచ్చేశా అని బీజేపీ నుంచి బయటికి వచ్చే సమయంలో బాబు మోహన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ ఓడాలని చూస్తున్నారు.. వీళ్లేం లీడర్లు.. ఇలాంటి నేతలను తాను ఏ పార్టీలోనూ చూడలేదని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఈ క్రమంలోనే తనను వాడుకొని బీజేపీ వదిలేసిందని.. బీజేపీ నేతలు పొమ్మనలేక పొగబెడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 4 March 2024 12:03 PM GMT
Tags:    
Next Story
Share it
Top