Home > తెలంగాణ > బాబు మోహన్కి షాక్.. పార్టీ మారుతున్న కొడుకు!

బాబు మోహన్కి షాక్.. పార్టీ మారుతున్న కొడుకు!

బాబు మోహన్కి షాక్.. పార్టీ మారుతున్న కొడుకు!
X

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేది దగ్గర పడుతున్న వేళ బీజేపీకి వరుస షాకులు తగులున్నాయి. వివిధ కారణాలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి వంటి కీలక నేతలు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా కమలానికి మరో షాక్ తగలింది. ఆందోల్ బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ బాబు మోహన్ కుమారుడు, ఉదయ్ బాబు కూమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయన.. బీజేపీకి రాజీనామా చేశారు. బాబు మోహన్ కూడా ఆందోల్ టికెట్ తన కుమారుడికే ఇవ్వాలని బీజేపీ అధిష్టానాన్ని కోరగా.. పార్టీ మాత్రం ఆయనకే టికెట్ కట్టబెట్టింది. దీంతో మనస్తాపం చెందిన ఉదయ్ మోహన్ కుమార్.. మంత్రి హరీశ్ రావు సమక్షంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఉదయ్ బాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

బీజేపీ ప్రకటించిన మొదటి జాబితాలో బాబు మోహన్ కు టికెట్ దక్కలేదు. దాంతో ఆయన పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి.. పార్టీకి, ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అధిష్టానం నిర్ణయాన్ని బట్టి పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పారు. అయితే అనూహ్యంగా రెండో లిస్ట్ లో టికెట్ బాబు మోహన్ కే కేటాయించారు. ఆందోల్ టిక్కెట్ దక్కగా.. టిక్కెట్ ఆశించిన ఉదయ్ బాబు కుమార్‌కి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో ఉదయ్ బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారట.

Updated : 19 Nov 2023 5:51 AM GMT
Tags:    
Next Story
Share it
Top