Home > తెలంగాణ > పాలకుర్తిలో ఠాగూర్ సినిమా రిపీట్.. పసికందు మృతి

పాలకుర్తిలో ఠాగూర్ సినిమా రిపీట్.. పసికందు మృతి

పాలకుర్తిలో ఠాగూర్ సినిమా రిపీట్.. పసికందు మృతి
X

జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో హృదయాన్ని కలిచి వేసే సంఘటన చోటు చేసుకుంది. పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందింది. మృతి చెందిన శిశువును బ్రతికే ఉందని నమ్మించి.. అంబులెన్స్ లో జనగామ ఆసుపత్రికి అధికారులు తరలించడం.. ఠాగూర్ సినిమాని తలపించేలా చేసింది.





మండలంలోని దర్ధపల్లి గ్రామానికి చెందిన జిట్టబోయిన స్రవంతి బుధవారం రాత్రి పురిటినొప్పులతో పాలకుర్తి ఆసుపత్రికి వచ్చింది. రాత్రి 10:30 సమయంలో స్టాప్ నర్స్ ఆమెకు నార్మల్ డెలవరి చేయబోయింది. డెలివరి సమయంలో పాప తల భాగం ఇరుక్కపోవడంతో , ఆమె సర్జరీ చేసి బయటకు తీసింది. ఈ క్రమంలోనే ఆ పసికందు మరణించింది. మృతి చెందిన పసికందును చికిత్సకు తీసుకెళ్లాలంటూ.. రాత్రికి రాత్రే 108లో జనగామ ఆసుపత్రికి తరలించారు అక్కడి స్టాఫ్. అయితే అప్పటికే పాప మృతి చెందినట్లు జనగామ వైద్యులు తెలుపడంతో స్రవంతి కుటుంబ సభ్యులు షాకయ్యారు. పాప మృతితో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే పాప మృతి చెందినట్లు ఆరోపిస్తున్నారు.







Updated : 24 Aug 2023 11:38 AM IST
Tags:    
Next Story
Share it
Top