Home > తెలంగాణ > గ్రూప్ 4 పరీక్షలో బలగంపై ప్రశ్న..సమాధానం ఏమిటి?

గ్రూప్ 4 పరీక్షలో బలగంపై ప్రశ్న..సమాధానం ఏమిటి?

గ్రూప్ 4 పరీక్షలో బలగంపై ప్రశ్న..సమాధానం ఏమిటి?
X

ఈ మధ్యకాలంలో విడుదలైన చిన్న సినిమా బలగం ఎవరూ ఊహించని విధంగా పెద్ద హిట్ సాధించింది. జబర్దస్త్ కమెడియన్ వేణు ఈ సినిమా హిట్‎తో టాలీవుడ్‎లో డైరెక్టర్‎గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మొదటిసారి మెగాఫోన్ పట్టినా కూడా తెరమీద భావోద్వేగాలను పండించి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు వేణు. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌ రామ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. వెండి తెరపైన దుమ్ముదులిపిన బలగం ఓటీటీలోనూ అదరగొట్టింది. మొదటిసారి 14కి పైగా టీఆర్‎పీ రేటింగ్‎తో హిస్టరీని క్రియేట్ చేసింది. అంతే కాదు ఇంటర్నేషనల్ అవార్డులను సైతం కొల్లగొట్టింది బలగం. సినిమా చూసిన ప్రతి ఒక్కరు నటీనటులు, దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణలోని చాలా వరకు పల్లెల్లో సినిమాను అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా పెద్ద పెద్ద ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేసి సినిమా ప్రదర్శించారంటే బలగానికి ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే తాజాగా బలగం సినిమాపై తెలంగాణలో నిర్వ‌హించిన గ్రూప్ - 4 ప‌రీక్ష‌లోనూ ఓ ప్ర‌శ్న వచ్చింది. ఇప్పుడు ఇదే టాపిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

తెలంగాణలో గ్రూప్‌-4 పరీక్ష శనివారం ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌-1 పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌-4 పరీక్ష కోసం ఏర్పాటు 2,878 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. ఇక పేపర్ -1లో తెలంగాణకు సంబంధించి అనేక ప్రశ్నలు వచ్చాయి...వాటితో పాటే ఈ మధ్య కాలంలో విడుదలైన మంచి ఆదరణ లభించిన 'బలగం' సినిమాకు సంబంధించిన ప్రశ్న కూడా వచ్చింది. బలగం చిత్రానికి సంబంధించి కింది ఆప్షన్‎లలో ఏవి సరైనవి అంటూ, సినిమా నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, కొమరయ్య పాత్ర పేర్లను ప్రస్తావించారు.

బ‌ల‌గం చిత్రానికి సంబంధించి కింది జ‌త‌ల‌లో ఏవి స‌రిగ్గా జ‌త‌ప‌రచబడినవి?

ఎ. ద‌ర్శ‌కుడు : వేణు యెల్దండి

బి. నిర్మాత : దిల్ రాజు, హ‌న్షితా రెడ్డి, హ‌ర్షిత్ రెడ్డి

సి. సంగీత ద‌ర్శ‌కుడు : భీమ్స్ సిసిరోలియో

డి. కొమ‌ర‌య్య పాత్ర‌ను పోషించిన‌వారు : అరుసం మ‌ధుసూధ‌న్‌





Updated : 1 July 2023 3:28 PM IST
Tags:    
Next Story
Share it
Top