Home > తెలంగాణ > బాలకృష్ణ మళ్లీ మొదలుపెడుతున్నాడు..

బాలకృష్ణ మళ్లీ మొదలుపెడుతున్నాడు..

బాలకృష్ణ మళ్లీ మొదలుపెడుతున్నాడు..
X

నందమూరి బాలకృష్ణ అనగానే పర్టిక్యులర్ ఇమేజ్ గుర్తొస్తుంది. ఆయన అగ్రెసివ్ నెస్ తో పాటు అతి కోపం, అది ప్రదర్శించే తీరు కూడా గుర్తొస్తుంది. ఈ కారణంగానే ఇండస్ట్రీతో పాటు బయట కూడా ఆయనపై నెగెటివ్ ఇమేజ్ ఉంటుంది. సినిమాల్లో ఎలా ఉన్నా.. బాలకృష్ణ అంటే బయట అంతగొప్ప ఇష్టం ప్రదర్శించేవారు కాదు. బట్ అలాంటి అభిప్రాయాలను పూర్తిగా మార్చేసింది అన్ స్టాపబుల్. తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో మొదలైన ఈ టాక్ షో కు అద్భుతమైన స్పందన వచ్చింది. బాలకృష్ణ ఇమేజ్ ను పూర్తిగా మార్చేసింది. అతన్లోని చిన్న పిల్లాడి తరహా మనస్తత్వాన్ని కూడా ప్రేక్షకుల ముందు ఆవిష్కరించింది. అలాంటి షో మళ్లీ మొదలు కాబోతోంది.

ఇప్పటికే అన్ స్టాపబుల్ రెండు సీజన్స్ పూర్తయి ఉన్నాయి. రెండూ సూపర్ హిట్ అనిపించుకున్నాయి. ఈ సీజన్స్ లో టాప్ హీరోల నుంచి టాప్ పొలిటీషియన్స్ తో పాటు స్మాల్ హీరోలను కూడా ఇంటర్వ్యూ చేశాడు బాలకృష్ణ.వీటిలో కొన్ని వినోదాన్ని పంచితే మరికొన్ని విజ్ఞానాన్నీ పంచాయి. మొత్తంగా ఈ షో ఇన్ఫోటైన్మెంట్ షో గా మోస్ట్ సక్సెస్ ఫుల్ అనిపించుకుంది. ఇక ఆహా ప్లాట్ ఫామ్ లో హిట్ అనిపించుకున్న ఏకైక టాక్ షో ఇదే అంటే అతిశయోక్తేం లేదు. అందుకే మరోసారి ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయించబోతున్నాడు అల్లు అరవింద్.

అన్ స్టాపబుల్ సీజన్ 3 స్టార్ట్ కాబోతోంది. ఈ మేరకు బాలయ్యతో అగ్రిమెంట్స్ కూడా అయిపోయాయి. ఈ నెల దసరా నుంచి ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమ్ అవుతుందని సమాచారం. ఈ ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా మెగాస్టార్ ను తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన వస్తే వెంటనే షూటింగ్ పూర్తి చేసి ఆ వెంటనే ప్రోమో వదిలితే దసరా వరకూ సీజన్ 3 గురించి అందరికీ తెలిసిపోతుంది. కాకపోతే మెగాస్టార్ వస్తాడా లేదా అనేదే పెద్ద అనుమానం. ఆ బాధ్యత అల్లు అరవింద్ కాస్త సీరియస్ గా తీసుకుంటే పనైపోతుంది. సో ఈ సారి దసరా పండగకు బాలయ్య ఫ్యాన్స్ కు భగవంత్ కేసరితో పాటు అన్ స్టాపబుల్ రూపంలో డబుల్ బొనాంజా రాబోతోందన్నమాట.


Updated : 6 Oct 2023 4:44 PM IST
Tags:    
Next Story
Share it
Top