Home > తెలంగాణ > BalkaSuman : కాళేశ్వరం ప్రాజెక్టు పై ప్రభుత్వం కుట్ర..బాల్కసుమన్ కామెంట్స్

BalkaSuman : కాళేశ్వరం ప్రాజెక్టు పై ప్రభుత్వం కుట్ర..బాల్కసుమన్ కామెంట్స్

BalkaSuman : కాళేశ్వరం ప్రాజెక్టు పై ప్రభుత్వం కుట్ర..బాల్కసుమన్ కామెంట్స్
X

తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పడు హాట్ టాపిక్ గా ఉంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఓవైపు ఈ వివాదం కొనసాగుతుండగానే... బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 'చలో మేడిగడ్డ' కార్యక్రమాన్ని చేపడుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ విమర్శించారు. ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కుంగిప పిల్లర్‌కు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రపంచానికి చెప్పేందుకు ప్రాజెక్ట్ సందర్శనకు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు వెళ్లున్నట్లు తెలిపారు.

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోవాలని సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రైతులకు నీళ్లిచ్చి వారిని కాపాడల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. కాళేశ్వరం విఫలమైందని చెప్పడం సరైనది కాదని ఆయన అన్నారు.ఒక్క బ్యారేజీ సమస్య వస్తే దాన్ని రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వానికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమైందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. తప్పు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీపై కోపాన్ని రైతులపై చూపించవద్దని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోవాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వర్షాకాలం వచ్చేలోపు ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

Updated : 1 March 2024 11:08 AM IST
Tags:    
Next Story
Share it
Top