Bandi Sanjay: కాంగ్రెస్ భవిష్యత్తు కేసీఆర్పై ఆధారపడి ఉంది: బండి సంజయ్
X
బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలెప్పుడూ కలిసే ఉంటాయని అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కలిసిపోయి.. మీడియా సమావేశాలు ఏర్పాటుచేస్తున్నారని విమర్శించారు. కరీంనగర్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన బండి సంజయ్.. తీవ్ర విమర్శలు చేశారు. అన్ని పార్టీలు ఏకమై బీజేపీ పార్టీని టార్గెట్ చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్ భవిష్యత్తు కేసీఆర్ పై ఆధారపడి ఉందని, దాంతో కాంగ్రెస్ నేతల్లో ఆందోళన నెలకొందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఏ నియోజక వర్గంలో కూడా డిపాజిట్లు రాని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు ఎలా ప్రత్యామ్నాయం అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలది అక్రమ సంబంధం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఓటింగ్ శాతం పెరిగిందని.. అలానే ఈ ఎన్నికల్లో కూడా తమ ఓటింగ్ శాతం పెరుగుతుందని చెప్పారు. అదే నమ్మకంతో ఎలక్షన్స్ లో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.