Home > తెలంగాణ > కోర్టుకు హాజరైన బండి సంజయ్.. విచారణ 20కి వాయిదా

కోర్టుకు హాజరైన బండి సంజయ్.. విచారణ 20కి వాయిదా

కోర్టుకు హాజరైన బండి సంజయ్.. విచారణ 20కి వాయిదా
X

బీజేపీ ఎంపీ బండి సంజయ్ హైకోర్టుకు హాజరయ్యారు. మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ నేపథ్యంలో ఆయన కోర్టుకు వెళ్లారు. ఈ కేసుకు సంబంధించి బండి సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తైంది. అడ్వొకేట్‌ కమిషనర్‌ ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు.

కరీంనగర్‌ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్‌ ఎన్నికను కొట్టేసి తనను ప్రకటించాలంటూ బండి సంజయ్‌ 2019లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సాక్షుల విచారణ, ఆధారాల పరిశీలన కోసం హైకోర్టు ధర్మాసనం రిటైర్డ్ జిల్లా జడ్జిని అడ్వొకేట్‌ కమిషనర్‌గా నియమించింది. ఈ క్రమంలో అడ్వొకేట్ కమిషనర్ ఎదుట హాజరైన బండి సంజయ్ వాంగ్మూలం ఇచ్చారు.

పార్లమెంటు సమావేశాలు, వ్యక్తిగత పనులు, అమెరికా పర్యటన కారణంగా బండి సంజయ్ పలుమార్లు క్రాస్ ఎగ్జామినేషన్‌ కు హాజరుకాలేకపోయారు. పదే పదే వాయిదా కోరడంపై ఇటీవల అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు.. సైనిక సంక్షేమ నిధికి రూ.50వేలు చెల్లించాలని బండి సంజయ్‌ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సైనిక సంక్షేమ నిధికి ఆ మొత్తం చెల్లించిన బండి.. క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేశారు. అనంతరం న్యాయమూర్తి కేసును సెప్టెంబరు 20వ తేదీకి వాయిదా వేశారు.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం బీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల కమలాకర్.. బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బండి ఓడిపోగా. గంగుల ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎన్నికల అఫిడవిట్​లో గంగుల కమలాకర్ తప్పుడు సమాచారం ఇచ్చారంటూ హైకోర్టులో బండి సంజయ్ పిటిషన్ వేశారు.




Updated : 15 Sep 2023 2:17 PM GMT
Tags:    
Next Story
Share it
Top