బండి సంజయ్ తొలగింపు..పార్టీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
X
బండి సంజయ్ ని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో.. కొందరు రాష్ట్ర కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. హైకమాండ్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం అర్బన్ బీజేపీ ఉపాధ్యక్షుడు.. గజ్జల శ్రీనివాస్ తీవ్ర మనస్తాపానికి గురైయ్యాడు. అధ్యక్షుడిగా దిగిపోవడాన్ని తట్టుకోలేక ఓ లేఖ రాసి, ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంతో ఆయనను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
‘సంజయ్ అన్నా.. ఇక సెలవు. సంజయ్ అన్నను అధ్యక్ష పదవి నుంచి తప్పించడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. ఎవరి మీద కోపం లేదు. నేను బండి అన్న మీద పెంచుకున్న ప్రేమతో ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. కష్టపడే నాయకుడికి దక్కే ప్రతిఫలం ఇదేనా..? అంటూ పలువురు కార్యకర్తలు బండి సంజయ్ కి మద్దతునిస్తున్నారు.