మోదీ సభకు.. అధ్యక్షుడి హోదాలో వస్తానో లేదో: బండి సంజయ్
X
ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాలు రచిస్తుంటే.. బీజేపీ నేతుల మాత్రం పదవుల కోసం పాకులాడుతున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అధిష్టానం కూడా బండిని తప్పించి.. కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యలు అప్పగించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బండి సంజయ్.. పార్టీ కార్యకర్తలతో చేసిన వ్యాఖ్యలు.. ఆ వార్తలను నిజం చేస్తున్నాయి.
ప్రధాని మోదీ జులై 8న హన్మకొండలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటిస్తున్న క్రమంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఏర్పాట్లను బండి సంజయ్ పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో.. ఆదివారం ఆయన వివిధ గ్రామాల కార్యకర్తలను కలిశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు బండి సంజయ్ ని ‘మీరే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలం’టూ కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంలో కార్యకర్తలతో మాట్లాడిన బండి.. ప్రధాని మోదీ సభకు తాను అధ్యక్షుడి హోదాలో వస్తానో లేదో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమని, ప్రధాని టూర్ ను విజయవంతం చేయాలని సమాధానం ఇచ్చారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.