Home > తెలంగాణ > సునీల్ బన్సల్తో బండి సంజయ్ భేటీ

సునీల్ బన్సల్తో బండి సంజయ్ భేటీ

సునీల్ బన్సల్తో బండి సంజయ్ భేటీ
X

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ హెడ్ క్వార్టర్స్ లో సమావేశమైన వీరిద్దరూ పార్టీ కార్యక్రమాల నిర్వాహణపై చర్చించారు.

పార్టీ త్వరలో చేపట్టనున్న జన సంపర్క్ అభియాన్, బూత్ సశక్తీకరణ్‌పై బండి, బన్సల్ చర్చించినట్లు సమాచారం. అయితే రాష్ట్ర బీజేపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్యా వీరిద్దరి భేటీ ప్రధాన్యం సంతరించుకుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా ఇతర పార్టీల నుంచి వలసలు తగ్గిపోయాయి. ఈటల రాజేందర్ సహా కీలక నేతలంతా బండిపై హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం, ఎవరికి వారే తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటంతో పార్టీకి నష్టం కలుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇద్దరు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.

మరో వైపు బీజేపీ అగ్రనేతలైన అమిత్ షా, జేపీ నడ్డాలు త్వరలో తెలంగాణకు రానున్నారు. ఈ క్రమంలో బీజేపీ భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది. వాటిని విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపైనా బండి, సునీల్ బన్సల్ చర్చించినట్లు సమాచారం

Updated : 6 Jun 2023 4:15 PM IST
Tags:    
Next Story
Share it
Top