Home > తెలంగాణ > చీకోటి విషయంలో అలా చేయడం కరెక్ట్ కాదు - బండి సంజయ్

చీకోటి విషయంలో అలా చేయడం కరెక్ట్ కాదు - బండి సంజయ్

చీకోటి విషయంలో అలా చేయడం కరెక్ట్ కాదు - బండి సంజయ్
X

చీకోటి ప్రవీణ్ చేరిక విషయంలో పార్టీ నేతల వైఖరిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తప్పుబట్టారు. పార్టీ ఆఫీసుకు పిలిచి చేర్చుకోకపోవడం సరికాదని అన్నారు. కట్టర్ హిందువైన చీకోటి బీజేపీలో చేరితే పార్టీకి మరింత బలం వస్తుందని బండి అభిప్రాయపడ్డారు. అమెరికా పర్యటన ముగించుకుని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన ఈ అంశంపై స్పందించారు.

తెలంగాణలో కుటుంబపాలన అంతం కావాలని ఎన్నారైలంతా కోరుకుంటున్నారని బండి అన్నారు. వారంతా మళ్లీ మోడీ సర్కారే రావాలనుకుంటున్నారని చెప్పారు. ఎన్నారైలకు ఏ సమస్య వచ్చినా మోడీ ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తోందని అందుకే కేంద్రంతో పాటు తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావాలని ప్రవాస తెలంగాణవాసులు కోరుకుంటున్నారని బండి సంజయ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అమెరికాలో ఉంటున్న తెలంగాణవాసులంతా స్వరాష్ట్రానికి వచ్చి బీజేపీ తరఫున ప్రచారం చేయడంతో పాటు తమ పార్టీకి ఓటు వేయాలని బండి పిలుపునిచ్చారు.




Updated : 12 Sept 2023 7:51 PM IST
Tags:    
Next Story
Share it
Top