Home > తెలంగాణ > Bandi Sanjay: కేటీఆర్.. పదవి మోజులో పడి కేసీఆర్ను ఏమైనా చేస్తడేమో: బండి సంజయ్

Bandi Sanjay: కేటీఆర్.. పదవి మోజులో పడి కేసీఆర్ను ఏమైనా చేస్తడేమో: బండి సంజయ్

Bandi Sanjay: కేటీఆర్.. పదవి మోజులో పడి కేసీఆర్ను ఏమైనా చేస్తడేమో: బండి సంజయ్
X

సీఎం పదవిని పొందేందుకు కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నాడని.. పదవి మోజులో పడి కేసీఆర్ ను ఏమైనా చేస్తడేమో అని భయంగా ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ఆదిలాబాద్ లో బీజేపీ నిర్వహించిన జన గర్జన సభలో మాట్లాడిన బండి సంజయ్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తన గురువు.. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా, బాగుండాలని కోరుకుంటానని తెలిపారు. కేటీఆర్ నుంచి కేసీఆర్కు కాపాడలని, ఆయనకు రక్షణ కల్పించాలని పోలీసులకు కోరారు. కేసీఆర్ ఆరోగ్య విషయం బయటకు చెప్పాలని, ఆయన్ను బయటి తీసుకొచ్చి తమ అందరికి చూపించాలని బండి సంజయ్ కోరారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తుంది. అసలు ఆ పార్టీకి ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. ప్రజలను ఉద్దేశించిన మాట్లాడిన బండి.. పోడు భూములకు పట్టాలు, 12 శాతం రిజర్వేషన్ ఇచ్చినట్లుయితే బీఆర్ఎస్ కు ఓటెయ్యండని చెప్పారు. ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు, ప్రమోషన్లు, ట్రాన్ఫర్లు ఇస్తే ఆ పార్టీకి ఓటెయ్యండి. పేద ప్రజలకు ఇండ్ల పట్టాలిస్తే ఆ పార్టీకి ఓటెయ్యండి. రుణ మాఫీ, పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటే ఆ పార్టీకి ఓటెయ్యండని ప్రజలకు సూచించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లను ఆపలేకపోయిన పార్టీ, 30 లక్షల మంది అభ్యర్థులను ఆగం చేసిన పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. నోటిఫికేషన్లు, ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నారని మండిపడ్డారు.

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ట్రైలర్ మాత్రమే హిట్ అయింది. పాలన అట్టర్ ప్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. అక్కడి ప్రజలు కాంగ్రెస్ లీడర్లపై కోపంతో ఉన్నారు. ఫ్లెక్సీలు చింపి, దాడులు చేస్తున్నట్లు బండి చెప్పుకొచ్చారు. అతి గతిలేని పార్టీ కాంగ్రెస్.. ఆచరణ సాధ్యం కాని హామిలిచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ను ఓడించి, కేసీఆర్ గద్దెదింపాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. అయితే కేసీఆర్ చేసిన రూ.5 లక్షల కోట్ల అప్పును కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీర్చుతుందో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన అప్పు తీరాలంటే.. తెలంగాణ ప్రజల బ్రతుకులు బాగుపడాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు. ఓటర్లు సమయాన్ని వృధా చేసుకోకుండా.. ఒక్కసారి ఆలోచించాలని కోరారు. ఆలోచించకుండా ఒక్క క్షణం వేసిన ఓటుతో.. ఐదేళ్ల పాటు బతుకులను ఆగం చేసుకోకండని ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి అధికారాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అదే జరిగితే అన్ని పార్టీలు కలిసి రాష్ట్రాన్ని అమ్ముకుంటారని ఆరోపించారు.

Updated : 10 Oct 2023 5:42 PM IST
Tags:    
Next Story
Share it
Top