Home > తెలంగాణ > కేసీఆర్ కనిపిస్తలేడు.. కేటీఆర్పైనే అనుమానం - బండి సంజయ్

కేసీఆర్ కనిపిస్తలేడు.. కేటీఆర్పైనే అనుమానం - బండి సంజయ్

కేసీఆర్ కనిపిస్తలేడు.. కేటీఆర్పైనే అనుమానం - బండి సంజయ్
X

మంత్రి కేటీఆర్పై బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను కేటీఆర్ ఏమైనా చేసిండా అని అనుమానం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ గత 15 రోజులుగా కనిపించడంలేదని, ఆయనకు ఏమైనా అయిందేమోనన్న అనుమానం కలుగుతోందని అన్నారు. ముఖ్యమంత్రిని కేటీఆర్ ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడేమోనని సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని బండి అన్నారు.

సీఎం కేసీఆర్తో ప్రెస్మీట్ పెట్టిస్తే అనుమానాలన్నీ పటాపంచలవుతాయని బండి సంజయ్ స్పష్టం చేశారు. నిజామాబాద్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రితో క్లారిటీ ఇప్పించాలని కోరారు. అప్పుడే ఆయన క్షేమంగా ఉన్నారని నమ్ముతామని అన్నారు. తమ ముఖ్యమంత్రి తమకు కనిపించేలా చూడాలని బండి సంజయ్ కల్వకుంట్ల కుటుంబాన్ని అభ్యర్థించారు.




Updated : 4 Oct 2023 7:59 PM IST
Tags:    
Next Story
Share it
Top