కాంగ్రెస్, బీఆర్ఎస్లపై బండి సంజయ్ ఫైర్
X
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సీఎం కేసీఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఉద్యోగుల కోసం పోరాడి జైలుకు వెళ్లానని గుర్తు చేశారు. సమస్యలపై పోరాడుతున్న తనపై కేసీఆర్ ఏకంగా 74 కేసులు పెట్టించాడని ఆరోపించారు. ప్రశ్నించే బండి సంజయ్ గొంతుకను కాపాడుకుంటారా..? లేదా పిసికేసుకుంటారా..? అంతిమ నిర్ణయం మీదే అని అన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు తనపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని బండి మండిపడ్డారు.
కరీంనగర్ ప్రజలకు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు చేసిందేమీ లేదని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. భూకబ్జాలు చేయడం, అవినీతి, వసూళ్లకు పాల్పడటం తప్ప ప్రజల గురించి పట్టించుకున్న పాపానపోలేదని విమర్శించారు. ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కరీంనగర్‌ను ఎంఐఎంకు అప్పగించే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే... అందుకు ప్రతిఫలంగా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిని ఎంఐఎంకు అప్పగించేలా ఒప్పందం కుదిరిందని బండి ఆరోపించారు.
ప్రజలారా... ఆలోచించండి..!
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 12, 2023
మీ కోసం ప్రశ్నించే గొంతుగా మారిన బండి సంజయ్ ను కాపాడుకుంటారా..? పిసికేసుకుంటారా ?
అంతిమ నిర్ణయం మీదే. పిల్లల భవిష్యత్తు కోసం, ఉద్యోగుల కోసం జైలుకు పోయినా. రైతుల కోసం లాఠీలు దెబ్బలు తిన్న. నాకు జైలు, కేసులు కొత్త కాదు. ఇప్పటివరకు 7 సార్లు జైలుకుపోయినా.… pic.twitter.com/JC47dp3Cpf