Bandi Sanjay : కాంగ్రెస్ - బీఆర్ఎస్ కుమ్కక్కై ప్రజలను మభ్యపెడుతున్నాయ్...
X
లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. 100 రోజుల్లోపు కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెల్లరేషన్ కార్డు ఉన్నా పథకాల్లో కోత పెడుతున్నారని.. 50లక్షల కుటుంబాలకు పథకాల్లో కోత పెట్టడం అన్యాయమని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో ఆయన చేపట్టిన ప్రజాహిత యాత్ర కొనసాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కై ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు.
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాగ్ చెప్పినా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ కోరితే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రాజకీయాలు పక్కనపెట్టి.. అభివృద్ధి చేస్తే కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో కృషి చేస్తోందని.. గత 10ఏళ్లలో సుమారు రూ.10లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని చెప్పారు. 175 రక్షణ భూములను రాష్ట్రానికి బదిలీ చేయడం హర్షణీయమన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 350కు పైగా సీట్లతో గెలవడం ఖాయమన్నారు.