Home > తెలంగాణ > పోస్టల్ బ్యాలెట్‌పై బండి సంజయ్ ఫైట్

పోస్టల్ బ్యాలెట్‌పై బండి సంజయ్ ఫైట్

పోస్టల్ బ్యాలెట్‌పై బండి సంజయ్ ఫైట్
X

మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరుగనుండగా.. పోస్టల్ బ్యాలెట్ వివాధం ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలింగ్ విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. పోలింగ్ విధుల్లో మొత్తం 3 లక్షల మంది ఉద్యోగులు ఉండగా వారిలో 2 లక్షల మందికే బ్యాలెట్ ఓట్లు మంజూరు చేశారు. దీంతో మిగిలిన లక్షమంది ఉద్యోగులు ఈసీపై ఆందోళనకు దిగారు. తమ ఓటును హక్కును వినియోగించుకునే సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈసీ కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. తమ ఓటున్న అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిని సంప్రదిస్తే.. వారికి మంగళవారం కూడా అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ జిల్లాల ఎన్నికల అధికారులైన కలెక్టర్లను సూచించారు.

ఈ క్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ ఈసీకి లేఖ రాశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఉద్యోగులందరికీ తగిన సమయమివ్వాలని బండి సంజయ్ కరీంనగర్ కలెక్టర్‌ను కోరగా.. ఈసీ సానుకూలంగా స్పందించింది. ఇవాళ సాయంత్రం వరకు గడువు పొడిగించాలని ఈసీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ ఉద్యోగులు బండికి ధన్యవాదాలు తెలిపారు.

Updated : 28 Nov 2023 1:48 PM IST
Tags:    
Next Story
Share it
Top