Home > తెలంగాణ > Bandi Sanjay : బండి సంజయ్ యాత్రలో ఉద్రిక్తత..స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం

Bandi Sanjay : బండి సంజయ్ యాత్రలో ఉద్రిక్తత..స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం

Bandi Sanjay : బండి సంజయ్ యాత్రలో ఉద్రిక్తత..స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం
X

బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ప్రజాహిత యాత్రను అడ్డుకోవటానికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో వెంటనే పోలీసులు అడ్డుకుని వారిని చెదరగొట్టారు. కాగా మంత్రి పొన్నంపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే కాంగ్రెస్ ఈ ఆందోళన చేపట్టినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలేపారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచార సందర్భంగా తాను బండి సంజయ్‌ను ప్రశ్నించానన్నారు. 5 సంవత్సరాల పదవి కాలంలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. శ్రీరాముని పేరు మీద ఓట్లు అడగడం కాదని.. మీరు నిజంగా నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

తాను ఎన్నడూ అనని మాటలను తనకు ఆపాదించడం తగదన్నారు. రాముడి పుట్టుక, అయోధ్య రాముడి అక్షింతలు, నా తల్లి జన్మకు సంబంధించి బండి మాట్లాడటం సమంజసం కాదన్నారు. తల్లి ఎవరికైనా తల్లే అని.. రాజకీయంగా అభివృద్ధికి సంబంధించిన విషయాలపై ప్రశ్నిస్తే బండి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయంగా డ్రామాలు చేస్తూ బండి సంజయ్ యాత్రని కొనసాగిస్తున్నారని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని యాత్రకి ప్రచారం రావాలని అడ్డుకున్నట్టు కొత్త డ్రామాలకు తెరలేపారన్నారు. మేము మీ యాత్రలు అడ్డుకోవడం లేదన్నారు. ప్రజా స్వామ్యంలో యాత్ర చేసే హక్కు అందరికి ఉందని.. మీరు మాట్లాడిన మాటలపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని అంటున్నారు కదా.. అయితే ప్రజలు, ప్రజాస్వామ్యమే మనకు చట్టం అన్నారు.భార్యకి మంగళ సూత్రం కడతారు. అటువంటి మంగళ సూత్రం అమ్మి ఎన్నికల్లో గెలిచాను అని బండి సంజయ్ చెబుతుంటారు. మరి తల్లిపై బండి చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వం ఆలోచించాలన్నారు.




Updated : 27 Feb 2024 8:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top