Home > తెలంగాణ > Bandi Sanjay : బండి సంజయ్ కాన్వాయ్‌పై కోడి గుడ్ల దాడి.. హైటెన్షన్

Bandi Sanjay : బండి సంజయ్ కాన్వాయ్‌పై కోడి గుడ్ల దాడి.. హైటెన్షన్

Bandi Sanjay  : బండి సంజయ్ కాన్వాయ్‌పై కోడి గుడ్ల దాడి.. హైటెన్షన్
X

బీజేపీ ఎంపీ బండి సంజయ్ కాన్వాయ్‌పై కోడి గుడ్ల దాడి జరిగింది. వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో ప్రజాహిత యాత్ర చేస్తుండగా గుర్త తెలియని వ్యక్తులు గుడ్లు విసిరారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్దం జరుతుంది. నిన్న కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ప్రజాహిత యాత్రను అడ్డుకోవటానికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో వెంటనే పోలీసులు అడ్డుకుని వారిని చెదరగొట్టారు. కాగా మంత్రి పొన్నంపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే కాంగ్రెస్ ఈ ఆందోళన చేపట్టినట్లు తెలుస్తోంది.





బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలేపారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల ప్రచార సందర్భంగా తాను బండి సంజయ్‌ను ప్రశ్నించానన్నారు. 5 సంవత్సరాల పదవి కాలంలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. శ్రీరాముని పేరు మీద ఓట్లు అడగడం కాదని.. మీరు నిజంగా నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దని, పరీక్షలు సాఫీగా జరిగేందుకు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరారు. బీజేపీ నేత బండి సంజయ్ యాత్రను అడ్డుకోవద్దంటూ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నానని పొన్నం వేడుకున్నారు. కాంగ్రెస్ నేతలు యాత్రను అడ్డుకుంటారని బీజేపీ నేతలు సెక్యూరిటీ కోరితే ఇంటర్ విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో పరీక్షా కేంద్రాల వద్ద సెక్యూరిటీ కల్పించాల్సి ఉంటుందని మంత్రి వెల్లడించారు




Updated : 28 Feb 2024 8:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top