Home > తెలంగాణ > అన్నా.. వస్తున్నా.. బండ్ల గణేష్‌ పొలిటికల్‌ ట్వీట్‌..

అన్నా.. వస్తున్నా.. బండ్ల గణేష్‌ పొలిటికల్‌ ట్వీట్‌..

అన్నా.. వస్తున్నా.. బండ్ల గణేష్‌ పొలిటికల్‌ ట్వీట్‌..
X

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, ప్రముఖ కమెడియన్ బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే బండ్లన్న సినిమాలు, రాజకీయాలకు సంబంధించిన అంశాలపై స్పందిస్తుంటారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. 2018 ఎన్నికల వరకు యాక్టీవ్‌గా పనిచేసిన ఆయన.. కాంగ్రెస్‌ ఓడిపోవడంతో సైలెంట్ అయిపోయారు. రాజకీయాలకు గ్యాప్ ఇచ్చారు. తాజాగా.. ఎన్నికలు సమీపిస్తుండటంతో మరోసారి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. తాను రాజకీయాల్లో లేనంటూనే కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆయన మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్‌ అయినట్టు తెలుస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో తాను పాల్గొంటున్నట్లు ప్రకటించారు బండ్ల గణేశ్. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. భట్టిని కలిసేందుకు సూర్యాపేట వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం భట్టి పాదయాత్ర సూర్యాపేటలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా బండ్ల గణేష్.. ‘‘అన్నా వస్తున్నా అడుగులో అడుగేస్తా.. చేతిలో చెయ్యేస్తా.. కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోటానికి మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నాను. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్’’ అంటూ ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ పేర్కొన్నారు.





Updated : 25 Jun 2023 8:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top