Bandlaguda Ganesh Laddu : బండ్లగూడ గణపతి లడ్డుకు కళ్లు చెదిరే ధర 1,26,00, 000
Mic Tv Desk | 28 Sept 2023 10:58 AM IST
X
X
గణపతి లడ్డు వేలానికి బాలాపూర్ ప్రసిద్ధి. బాలాపూర్ గణపతితో ఇతర గణపతులు కూడా పోటీ పడి మించిపోతున్నారు. రాజేంద్రనగర్ బండ్లగూడలోని రిచ్‌మండ్ విల్లాల సొసైటీలో ఏర్పాటు చేసిన గణపతి లడ్డుకు రికార్డు ధర పలికింది. ఓ వ్యక్తి ఏకంగా రూ. 1.26 కోట్లకు స్వామి ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. విల్లాల యజమానులందరూ కలసి లడ్డును కొన్నారు. హైదరాబాద్ గణపయ్య లడ్లకు ఇంత భారీ ధరల పలకడం ఇదే తొలిసారి. ఈ గణపయ్య లడ్డు గత ఏడాది రూ. 60.80 లక్షలు పలకగా ఈసారి రెట్టింపు ధర పలికింది. మరోపక్క బాలాపూర్ గణతి లడ్డు వేలం ఇంకా కొనసాగుతోంది. గత ఏడాది ఈ లడ్డు ధర రూ. 24 లక్షలు పలికింది. కాగా, గచ్చిబౌలి గణపతి లడ్డును చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి రూ. 25.50 లక్షలకు కొన్నాడు. గతేడాదితో పోలిస్తే ఈసారి రూ. 7 లక్షల ఎక్కువ పలికింది.
Updated : 28 Sept 2023 11:04 AM IST
Tags: Bandlaguda Ganesh laddu Ganesh laddu auction laddu with record price balapur laddu auction richmand villa ganesh statue
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire