ఓటేసిన బర్రెలక్క
X
తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ప్రజలు ఓటు వేస్తున్నారు. మొత్తం 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం 3.25 కోట్ల మంది ప్రజలు చేతుల్లో ఉంది. సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సోషల్ మీడియాలో బర్రెలక్కగా పేరు పొందిన శిరీష తన ఓటు హక్కును వినియోగించుకుంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శిరీష ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొల్లాపూర్ నుంచి పోటీ చేస్తోంది.
“హాయ్ ఫ్రెండ్స్…బర్ల కాయనీకి వచ్చిన ఫ్రెండ్స్ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసి ఫేమస్ అయ్యింది నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష. డిగ్రీలు చదువుకున్నా ఉద్యోగాలు భర్తీ కాకపోవడంపై ఆమె ప్రశ్నిస్తూ వీడియోలు పెట్టడంతో బర్రెలక్కకు నెట్టింట్లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. అంతే కాదు అప్పట్లో ఆమె చాలా మంది ట్రోల్ కూడా చేశారు. ఇప్పటికీ బర్రెలక్కను ఫ్రెండ్స్ అంటూ వచ్చే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. దీంతో శిరీష బర్రెలక్కగా మంచి పేరును సంపాదించుకుంది. ఈ క్రమంలో తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో రాజకీయ ప్రవేశం చేయాలని నిర్ణయించుకుంది. కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచింది. శిరీష నిర్ణయాన్ని స్వాగతిస్తూ పలువురు ప్రముఖులు ఆమెకు మద్దతు అందించారు.