Home > తెలంగాణ > మూడు రోజులు వైన్స్ బంద్.. ఎందుకంటే..?

మూడు రోజులు వైన్స్ బంద్.. ఎందుకంటే..?

మూడు రోజులు వైన్స్ బంద్.. ఎందుకంటే..?
X

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో సమాప్తం కానుంది. సాయంత్రం ఐదు గంటల్లోపు ప్రచారాన్ని ముగించుకోవాలి. దీంతో ఉదయం నుంచే పార్టీలన్నీ ప్రచారాన్ని మొదలుపెట్టాయి. సాయంత్రానికల్లా సాధ్యమైనన్ని ప్రాంతాల్లో ప్రచారాన్ని జరపాలని చూస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల కీలక నేతలంతా రాష్ట్రంలోనే మకాం వేయగా.. మిగిలిన ఈ కొన్ని గంటల్లో రాజకీయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా మందు బాబులకు మాత్రం ఇది చేదు వార్తే అని చెప్పాలి. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతుండగా.. అందులో భాగంగానే వైన్స్ కూడా మూత పడనున్నాయి. ఇవాళ్టి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు అంటే నవంబర్ 30వ తేదీ వరకు వైన్స్ పూర్తిగా మూత పడనున్నాయి. ఈ విషయంపై వైన్స్‌, బార్ల యజమానులకు కేంద్ర ఎన్నికల సంఘం ముందస్తు సమాచారం ఇచ్చింది. దీనిపై ఎక్సైజ్ శాఖను ఈసీ అప్రమత్తం చేసింది. ఎలక్షన్ కోడ్ ఉల్లఘిస్తే సదరు నిర్వామకులపై కేసు నమోదు చేసి.. లైసెన్స్ ను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Updated : 28 Nov 2023 8:20 AM IST
Tags:    
Next Story
Share it
Top