Home > తెలంగాణ > బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశాల నోటిఫికేషన్ రిలీజ్

బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశాల నోటిఫికేషన్ రిలీజ్

బాసర ట్రిపుల్ ఐటీ ప్రవేశాల నోటిఫికేషన్ రిలీజ్
X

బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజైంది. 2023 - 24 అకడమిక్ ఇయర్ కు సంబంధించి ఆరేండ్ల ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు బాసర ట్రిపుల్ ఐటీ వీసీ వెంకటరమణ నోటిఫికేషన్ విడుదల చేశారు. జూన్‌ 5 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. పీహెచ్‌, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ కోటా వారికి జూన్‌ 24వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. admissions@rgukt.ac.in వెబ్‌సైట్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని స్పష్టం చేశారు.

అడ్మిషన్ల ప్రక్రియను ఈసారి కూడా పాత పద్ధతిలోనే చేపట్టనున్నారు. పదో తరగతి జీపీఏ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. జూన్‌ 26న మెరిట్‌ జాబితా విడుదల చేస్తామని వీసీ చెప్పారు. వారంతా జులై 1న రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి పదో తరగతి గ్రేడ్‌కు 0.40 స్కోర్‌ ను కూడా కలుపుతారు. విద్యార్థుల స్కోర్‌ గ్రేడ్ సమానంగా ఉంటే పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొదట మాథ్స్, తర్వాత సైన్స్‌, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, ఫస్ట్ లాంగ్వేజ్ గ్రేడ్‌ను పరిశీలించి సీట్లు కేటాయిస్తారు.

బాసర ట్రిపుల్ ఐటీలో 1650 ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ (ఇంటర్‌+బీటెక్‌) సీట్లు ఉన్నాయి. వివిధ కేటగిరీల కింద1500 సీట్లు.. ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద మరో 150 సీట్లను అదనంగా భర్తీ చేయనున్నారు. మొత్తం ఉన్న సీట్లలో 85 శాతం తెలంగాణ స్థానిక విద్యార్థులకుకేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా పోటీపడుతారు. ఈ సంవత్సరం పదో తరగతి పాసైన వారు మాత్రమే ప్రవేశాలకు అర్హులని అధికారులు చెప్పారు.


Updated : 31 May 2023 11:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top