Home > తెలంగాణ > అధికారులు బీఆర్ఎస్ ఒత్తిళ్లకు లొంగొద్దు : భట్టి

అధికారులు బీఆర్ఎస్ ఒత్తిళ్లకు లొంగొద్దు : భట్టి

అధికారులు బీఆర్ఎస్ ఒత్తిళ్లకు లొంగొద్దు : భట్టి
X

తెలంగాణలో డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ నేతలు భూదోపిడీలకు పాల్పడుతున్నారని.. లక్షల కోట్ల విలువైన భూములు కాజేశారని ఆరోపించారు.ధరణిని అడ్డుపెట్టుకుని హైదరాబాద్‌ పరిధిలో వేలాది ఎకరాలు దోచుకున్నారన్నారు. ఈ క్రమంలో రెవెన్యూ శాఖ అధికారులకు కీలక సూచనలు చేశారు.

రెవెన్యూ వ్యవస్థను అప్రమత్తం చేస్తున్నట్లు భట్టి చెప్పారు. ఈ రెండు,మూడు రోజుల్లో కాంట్రాక్టర్లకు వేల కోట్ల చెల్లింపులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గద్దని సూచించారు. అధికారులు అనవసరమైన వివాదాల్లో చిక్కుకోవద్దని సూచించారు. అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ భూములను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే పక్రియ జరుగుతోందన్నారు. ప్రభుత్వ అన్ని ట్రాన్సాక్ష‍న్స్‌పై నిఘా పెట్టాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని భట్టి తెలిపారు.


Updated : 1 Dec 2023 2:00 PM GMT
Tags:    
Next Story
Share it
Top