వినాయక చవితి తేదీపై క్లారిటీ ఇచ్చిన భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ
Kiran | 6 Sept 2023 8:18 PM IST
X
X
వినాయక చవితి పండుగ తేదీ, నిమజ్జనంపై నెలకొన్న అనుమానాలపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 18వ తేదీన వినాయక చవితి జరుపుకోవాలని స్పష్టం చేసింది. ఈ నెల 28న నిమజ్జనం ఉంటుందని కమిటీ అధ్యక్షుడు డా.భగవంత్ రావు స్పష్టం చేశారు.
ఈ ఏడాది చవితి తిధి రెండు రోజులు ఉంది. దీంతో పండుగ 18న జరుపుకోవాలా లేక 19న చేసుకోవాలా అనే విషయంలో అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఇవాళ భేటీ అయిన గణేశ్ ఉత్సవ కమిటీ క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 28న శోభాయాత్ర, నిమజ్జనం ఉంటుందని చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 18న నవరాత్రులు ప్రారంభించి 28న నిమజ్జనం చేసుకోవాలని సూచించింది.
శృంగేరి, కంచి పీఠాధిపతుల పంచాంగం సైతం 18వ తేదీనే వినాయక చవితి జరుపుకోవాలని సూచించిందని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ చెప్పింది. ప్రభుత్వం 18న పండగ సెలవు, 28న నిమజ్జన సెలవు ప్రకటించాలని కోరింది.
Updated : 6 Sept 2023 8:18 PM IST
Tags: telangana hyderabad Bhagyanagar ganesh utsava committee vinayaka chavithi september 18 bhagwanth rao chathurthi shobha yatra immersion shringeri kanchi peetadhipathi government holiday
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire