Home > తెలంగాణ > బీసీ రిజర్వేషన్ బిల్లు.. భారత జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయాలు..

బీసీ రిజర్వేషన్ బిల్లు.. భారత జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయాలు..

బీసీ రిజర్వేషన్ బిల్లు.. భారత జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయాలు..
X

భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. మొత్తం 9 తీర్మానాలకు రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమోదం తెలిపారు. పూలే విగ్రహ ఏర్పాటుపై ఏప్రిల్ 11 లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పూలేకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

కేంద్రంలో ఓబీసీల కోసం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంతో పాటు త్వరితిగతిన బీసీ జనగణన చేపట్టాలని సమావేశంలో తీర్మానించింది. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని కోరింది. బీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. 8, 9, 10 తరగతుల పాఠ్యపుస్తకాల్లో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను పొందుపర్చాలని తీర్మానించారు. కర్పూరి ఠాకూర్కు భారతరత్న ప్రకటించినందుకు భారత జాగృతి హర్షం వ్యక్తం చేసింది.

రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ఇచ్చిన సూచనలు, సలహాలను స్వీకరించామని.. వాటిని తర్వాత కార్యచరణలో చేర్చుతామని భారత జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పటికీ సమావేశానికి వచ్చిన సీపీఐకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకు తాము చేస్తున్న ఈ పోరాటానికి మద్ధతుగా రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి లేఖలు రాయాలని కోరారు. ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటిస్తామన్న ఆమె.. ఏప్రిల్ 11లోపు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చేలా చేస్తామన్నారు.


Updated : 26 Jan 2024 7:42 PM IST
Tags:    
Next Story
Share it
Top