యాదాద్రిలో కింద కూర్చోవడంపై క్లారిటీ ఇచ్చిన భట్టి
X
యాదగిరిగుట్టలో కింద కూర్చోవడంపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. పీట మీద కూర్చోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి. ఈ తరుణంలో తాను కావాలనే స్టూల్ మీద కూర్చున్నానని భట్టి క్లారిటీ ఇచ్చారు. తన ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి కొందరు కావాలనే ట్రోల్స్ చేస్తున్నారన్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థికశాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నానని, రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నానని, అలాంటి తాను ఎవ్వరికీ తల వంచేవాడిని కానని అన్నారు.
ఎవరో కింద కూర్చోబెడితే కూర్చునే వాడిని కానని అన్నారు. ఆత్మ గౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదని చెబుతూనే యాదాద్రి వివాదానికి భట్టి ఫుల్‌స్టాప్ పెట్టారు. యాదాద్రి దేవాలయంలో పూజలు చేస్తున్న సందర్భంగా భట్టీ చిన్న పీటపై కూర్చున్నారు. ఆ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం దంపతులు, మంత్రులు సహా పైన కూర్చున్నారు. అయితే భట్టి మాత్రం పీటపై కూర్చోవడంతో తీవ్ర దుమారం రేగుతోంది.
ఈ నేపథ్యంలో యాదాద్రీశుడి సాక్షిగా దళిత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘోర అవమానం జరిగిందని బీఆర్ఎస్, బీఎస్పీ నేతలు విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో దళితుడు అనే కారణంగా భట్టిని కింద కూర్చోబెట్టారని పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేశారు. దీనిపై నెట్టింట ట్రోల్స్ కూడా ఎక్కువయ్యాయి. దీంతో దీనిపై స్వయంగా భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. తనకు ఎలాంటి అవమానం జరగలేదన్నారు. కావాలనే తాను చిన్న పీటపై కూర్చున్నానని స్పష్టం చేశారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.