Home > తెలంగాణ > ఆ ప్రాజెక్టుపై అసెంబ్లీలో కేసీఆర్ అన్నీ అబద్దాలే చెప్పారు : భట్టి

ఆ ప్రాజెక్టుపై అసెంబ్లీలో కేసీఆర్ అన్నీ అబద్దాలే చెప్పారు : భట్టి

ఆ ప్రాజెక్టుపై అసెంబ్లీలో కేసీఆర్ అన్నీ అబద్దాలే చెప్పారు : భట్టి
X

సీతారామ ప్రాజెక్ట్లో భారీ కుంభకోణం జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 2014లో రాజీవ్‌ దుమ్ముగూడెం - ఇందిరానగర్ చేపడితే కొత్త ఆయకట్టుకు నీరందేదని.. కానీ పాత ప్రాజెక్టు పేరు మార్చి సీతారామ సాగర్‌ పేరిట నిర్మాణం చేపట్టారన్నారు. పేరు మార్చి ప్రాజెక్ట్ వ్యయాన్ని 18వేల కోట్లకు తీసుకెళ్లారని మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రుల సమీక్ష నిర్వహించారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలిపేందుకే ఈ సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.

సీతారామ ప్రాజెక్టులో జరిగినంత అధికార దుర్వినియోగం ఇంకా ఎక్కడా జరగలేదని మంత్రులు ఆరోపించారు. రాజీవ్ దుమ్ముగూడెం ప్రాజక్టుకు రూ.1400 కోట్లు ఖర్చు చేస్తే 3లక్షల ఎకరాలకు నీరు అందేది అని.. కానీ ప్రాజెక్ట్ మెర్జ్ చేసిన ఇప్పటికే రూ.7వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. అయినా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని మండిపడ్డారు. ఆ ప్రాజెక్టుపై అసెంబ్లీలో కేసీఆర్ అన్నీ అబద్దాలే చెప్పారని విమర్శించారు. త్వరలోనే సీతారామ ప్రాజెక్టును సందర్శిస్తామని స్పష్టం చేశారు.


Updated : 19 Jan 2024 7:35 PM IST
Tags:    
Next Story
Share it
Top