Home > తెలంగాణ > ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్న భయంతోనే టికెట్ల ప్రకటన : భట్టి

ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్న భయంతోనే టికెట్ల ప్రకటన : భట్టి

ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్న భయంతోనే టికెట్ల ప్రకటన : భట్టి
X

గజ్వేల్‌లో ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీచేస్తున్నారని కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సర్వే నివేదికలు చూస్తే కేసీఆర్ గెలిచే పరిస్థితి లేదని..ముందు జాగ్రత్త కోసం మరో నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తున్నారన్నారు. కేసీఆర్ గెలవనప్పుడు అతని బొమ్మతో మిగతా అభ్యర్థులు ఎలా గెలుస్తారని ప్రశ్నించారు.

అభ్యర్థుల ప్రకటనపై సీఎం కేసీఆర్ ముందే కూశారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారనే భయంతో ముందుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించారని ఆరోపించారు. ఎవరైనా ఎన్నికల తేదీలు ఖరారయ్యాక అభ్యర్థులను ప్రకటిస్తారని కేసీఆర్ ముందే వెల్లడించి..నేతలను కాపాడుకునే ప్రయత్నం చేశారన్నారు. బీఆర్ఎస్ పాలనతో నష్టపోయినవారందరు కాంగ్రెస్ పార్టీతో కలిసిరావాలిని భట్టి పిలుపునిచ్చారు.

ఫిబ్రవరి నుంచే కాంగ్రెస్ ఎన్నికల ప్రాచారం ప్రారంభించిందని భట్టి తెలిపారు. కాంగ్రెస్‌తోనే తెలంగాణ లక్ష్యం నెరవేరుతుందన్న ఆయన.. పీపుల్స్ ప్రభుత్వ ఏర్పాటుకు సమయం దగ్గర్లో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం దరఖాస్తులను ఆహ్వానించిందని, పరిశీలన జరుగుతోందని, ఈ ప్రక్రియ తర్వాత సమయానుకూలంగా జాబితాను ప్రకటిస్తామన్నారు. ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమన్నారు. సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్ మెంట్ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్లబోతున్నట్లు స్పష్టం చేశారు.


Updated : 21 Aug 2023 10:19 PM IST
Tags:    
Next Story
Share it
Top