తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై భట్టి విక్రమార్క సమీక్ష..
X
తెలంగాణలో నూతన మంత్రులు తమ శాఖలపై రివ్యూలు చేపడుతున్నారు. ఇవాళ ఉదయం మంత్రులకు రేవంత్ శాఖలు కేటాయించగా.. పలువురు మంత్రులు తమ శాఖలపై సమీక్షలు చేపట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో ఆర్థికశాఖ అధికారులతో భట్టి సమీక్ష నిర్వహించారు. శాసనసభ వాయిదా పడిన అనంతరం సెక్రటేరియట్కు వెళ్లిన భట్టికి ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సహా అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆర్థికశాఖ కార్యదర్శులు, అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాలతో పాటు పలు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2014 జూన్ 2 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ఆదాయం, వ్యయం, కలిగిన ప్రయోజనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశాలపై భట్టి విక్రమార్క అధికారులతో చర్చించారు.