Home > తెలంగాణ > కాంగ్రెస్కు షాక్.. బీఆర్ఎస్లోకి భువనగిరి కాంగ్రెస్ నేత..!

కాంగ్రెస్కు షాక్.. బీఆర్ఎస్లోకి భువనగిరి కాంగ్రెస్ నేత..!

కాంగ్రెస్కు షాక్.. బీఆర్ఎస్లోకి భువనగిరి కాంగ్రెస్ నేత..!
X

భువనగిరి కాంగ్రెస్లో ముసలం ముదిరింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డిగా పరిస్థితి మారింది. కోమటిరెడ్డి గ్రూప్ రాజకీయాలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని అనిల్ కుమార్ అన్నారు. నియోజకవర్గంలో తనను ఓడగొట్టేందుకు రహస్య మంతనాలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత లాభాన్ని వదులుకుని కాంగ్రెస్ కేడర్ను కాపాడుకుంటూ వస్తున్నట్లు తెలిపారు.

కోమటిరెడ్డికి వ్యతిరేకంగా అనిల్ కుమార్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే కోమటిరెడ్డిపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ‘‘40 ఏళ్లలో భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఇప్పటి వరకు నియోజవర్గంలో ఓడిన వారెవరూ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో లేరు. నేను మాత్రం ఎనిమిదిన్నర ఏళ్లుగా అందుబాటులో ఉంటూ అందరిని కలుపుకొని పోతున్నా. గడిచిన నాలుగు నెలలుగా నియోజకవర్గంలో కోమటిరెడ్డి మాకు సమాంతరంగా మీటింగులు నడుపుతూ క్యాడర్ను అయోమయానికి గురి చేస్తున్నారు అని ఆరోపించారు.

ఈ క్రమంలో అనిల్ కుమార్ బీఆర్ఎస్లో చేరుతారని తెలుస్తోంది. తన అనుచరులతో కలిసి ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్ నేతలు కూడా ఆయన్ని కలిశారని.. ఆయన కూడా కారుపార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారని సమాచారం. అనిల్ కుమార్ బీఆర్ఎస్లో చేరడం కాంగ్రెస్ ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. మరి దీనిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.

Updated : 24 July 2023 1:24 PM GMT
Tags:    
Next Story
Share it
Top