బీజేపీకి బిగ్ షాక్..కేంద్ర మంత్రి రాజీనామా
X
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్ జన శక్తి ప్రెసిడెంట్ పశుపతి కుమార్ పరాస్ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్డీయే కోసం నిజాయతీగా పని చేసినా తమ పార్టీకా అన్యాయం జరిందన్నారు. ఈ నేపధ్యంలో కూటమి నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. కాగా బీహార్‌లో లోక్ సభ సీట్లు కేటయింపులో ఆర్ఎల్‌జైపీకీ ఒక్క సీటూ కేటయించలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తి గురియ్యారు.
17 సీట్లలో బీజేపీ పోటీ చేయనుండగా, నితీష్‌కుమార్ సారథ్యంలోని జనతాదళ్ యూనైటెడ్ 16 సీట్లలో పోటీ చేయనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఈ విషయాన్ని సోమవారం ప్రకటించారు. ఎన్డీయే మరో భాగస్వామిగా ఉన్న చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి పార్టీ 5 సీట్లలో పోటీ చేయనుంది. హిందుస్థానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్‌మోర్చా చెరో స్థానంలోనూ పోటీ చేయనున్నాయి
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.