బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్..20 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరిక
X
బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. భద్రాది కొత్తగుడెం జిల్లాలో బీఆర్‌ఎస్ చెందిన 20 మంది కౌన్సిలర్లు హస్తం గూటికి చేరారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. కాగా ఈ కౌన్సిలర్లు కొంతకాలంగా స్దానిక బీఆర్ఎస్ నాయకత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ లో ఉన్న చాలా మంది నాయకులు… హస్తం కండువా కప్పేసుకుంటున్నారు. ఎన్నికలు వేళ నాయకులు చేజారుతున్న పార్టీ బాధ్యతలు చూస్తున్న ముఖ్య నేతలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయటం లేదు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు కింది స్థాయి నాయకులను, కార్యకర్తలను పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుడడంతో వారిలో నైరాశ్యం నెలకొంటుందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఓటర్ల తీరుకు అనుగుణంగానే ఆయా రాజకీయ పార్టీల నేతలు సైతం సొంత గూటిని వీడి కండువాలు మార్చేస్తున్నారు. లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పకడ్బందీగా వ్యూహంతో వలసల కోసం గేట్లు తెరుస్తున్నారు.