Home > తెలంగాణ > Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు షాక్.. స్నానాలపై కీలక నిర్ణయం

Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు షాక్.. స్నానాలపై కీలక నిర్ణయం

Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు షాక్.. స్నానాలపై కీలక నిర్ణయం
X

శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. సాధారణ రోజులతో పోలిస్తే పర్వదినాలు, పండగ రోజుల్లో భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. చాలా మంది భక్తులు నదీ స్నానాలు చేసి శ్రీశైలం మల్లన్నను దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇకపై ఆ వీలు ఉండని తెలుస్తోంది. శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ తక్కువగానే ఉంది. ఈ సమయంలోనే మహా కుంభాభిషేకం, శివరాత్రి ఉత్సవాలు వస్తున్నాయి.

శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ పరిమితంగానే ఉండటంతో శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు స్నానాలు చేసేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక షవర్లను ఏర్పాటు చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 215 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం 38.8 టీఎంసీల నీరు మాత్రమే ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 1వ తేది నుంచి మార్చి 11వ తేది వరకూ కుంభాభిషేకం, శివరాత్రి ఉత్సవాలు జరగనున్న సందర్భంగా భక్తులు కృష్ణా జలాల్లో స్నానమాచరించడం ఆనవాయితీగా వస్తోంది.

అయితే నీటి సమస్యను తగ్గించేందుకు, భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా నీటిని సంరక్షించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. దీంతో రాజుల సత్రం, ఆర్టీసీ బస్టాండ్ వెనక ఉన్న పాతాళగంగ స్నానఘట్టాల వద్ద షవర్లు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అలాగే ఆనకట్ట దిగువన ఉన్న లింగాలగట్టు వద్ద స్నానాలు చేసేందుకు చర్యలు చేపట్టారు.

Updated : 21 Feb 2024 5:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top