Home > తెలంగాణ > మైనార్టీలకు రూ. లక్ష ఆర్థిక సహయం.. 27 వేల మందికే!!!

మైనార్టీలకు రూ. లక్ష ఆర్థిక సహయం.. 27 వేల మందికే!!!

మైనార్టీలకు రూ. లక్ష ఆర్థిక సహయం.. 27 వేల మందికే!!!
X

మైనార్టీల సంక్షేమం, సాధికారత కోసం నూరుశాతం సబ్సిడీతో రూ.లక్ష ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిన సీఎం .. వారి సామాజిక, ఆర్థిక, విద్యా సాధికారతకు పలు పథకాలను అమలు చేస్తున్నామని కొన్ని రోజుల కిందట తెలిపారు. సీఎం ప్రకటనతో.. అర్హులైన వారికి 2023-24లో రూ.లక్ష ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది కూడా. అయితే ఈ సహాయాన్ని ఈ ఏడాది పరిమిత స్థాయిలోనే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అర్హులైన కుటుంబాలన్నింటికీ ఇస్తామని చెబుతున్నా.. ఈ ఫైనాన్షియల్ ఇయర్‌(2023-24)లో కేవలం 27 వేల మందికి మాత్రమే వర్తింపజేయాలనుకుంటున్నట్లు అధికారులు సూచనప్రాయంగా తెలిపారు. ఆర్థిక వనరులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఈ ఏడాది ఈ స్కీమ్ కోసం రూ.270 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ తయారు చేసినట్లు తెలిసింది. ఆ మేరకు మాత్రమే లబ్ధిదారులకు సాయం అందించి, మిగిలినవారికి దశలవారీగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కంటిన్యూ చేయనున్నది.

క్రిస్టియన్లకు రూ. 30 కోట్లే..

ఈ స్కీమ్ అమల్లోకి రాకముందే మరో పథకం ద్వారా ముస్లిం మైనార్టీల నుంచి రుణాల కోసం సుమారు రెండున్నర లక్షలకు పైగా దరఖాస్తులొచ్చాయి. వాటినే ఈ స్కీమ్‌కు లింక్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రారంభమైన క్రిస్టియన్ల దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల 14 వరకు కంటిన్యూ కానున్నది. గడువు ముగిసిన తర్వాత ఈ అప్లికేషన్లన్నింటినీ స్క్రూట్నీ చేసి, తర్వాత గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉన్నవాటిని ఫిల్టర్ చేసి అర్హత కలిగినవారి జాబితాను అధికారులు ఫైనల్ చేయనున్నారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ముగిసిన తర్వాత సెప్టెంబరులో ఈ స్కీమ్‌ను లాంఛనంగా ప్రారంభం కానున్నది. క్రిస్టియన్ల కోసం సుమారు రూ. 30 కోట్లను కేటాయించే అవకాశమున్నట్లు అధికార వర్గాల సమాచారం. వచ్చే సంవత్సరం నుంచి దరఖాస్తుల సంఖ్యకు అనుగుణంగా నిధులను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది.




Updated : 30 July 2023 9:37 AM IST
Tags:    
Next Story
Share it
Top