New Scam : హైదరాబాద్‌లో బిహారీ బ్యాచ్ కొత్త దందా...
X
హైదరాబాద్ నగరంలో బెగ్గింగ్ మాఫియా ఆడగాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇటీవల వృద్ధులు, చిన్నారులు,మహిళలతో బెగ్గింగ్ మాఫియాతో అక్రమార్కులు దందాలకు దిగుతున్నారు. ఇటీవల వృద్ధులతో భిక్షాటన చేయిస్తున్న అనిల్ పవార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా బీహార్ ముఠా చేసే బెగ్గింగ్ దందాలు వెలుగుచూశాయి. ట్రాన్స్ జెండర్లు వేషంలో భిక్షాటన చేస్తున్న కొందరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరవ్యాప్తంగా 15 మందిని అరెస్ట్ చేశారు. వారు బీహార్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్యారడైజ్, జూబ్లిహిల్స్, సికింద్రాబాద్ స్టేషన్ పరిధిలో వీరు దందా చేస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. వీరిని ఐదుగురు వ్యక్తులు వెనుకనుంచి నడిపిస్తున్నారని పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
రెండు రోజులు క్రితం వృద్ధులను తీసుకొచ్చి వారితో భిక్షాటన చేయించి డబ్బులు సంపాదిస్తున్న అనిల్ పవార్ అనే వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కొక్కరికి రోజుకు రూ.200లు ఇచ్చి.. భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బు అంతా తానేతీసుకుంటున్నాడు. ఈక్రమంలో పోలీసులు బెగ్గింగ్ మాఫియాను గుర్తించిన పోలీసులు నిర్వహకుడు అనిల్ పవార్ ను అరెస్ట్ చేశారు. అలాగే దాదాపు 25మంది యాచకులను అదుపులోకి తీసుకున్నారు.