Home > తెలంగాణ > ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం.. బండి సంజయ్కి ముద్దులు పెట్టిన అభిమాని

ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం.. బండి సంజయ్కి ముద్దులు పెట్టిన అభిమాని

ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం.. బండి సంజయ్కి ముద్దులు పెట్టిన అభిమాని
X

తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం (జులై 6) హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు శంషాబాద్ విమానాశ్రయానికి భారీ సంఖ్యలో చేరుకుని బండికి ఘన స్వాగతం పలికారు. ఆయనపై పూల దండలు, శాలువాలు కప్పి అభిమానం చాటుకున్నారు. భుజాలపై ఎత్తుకుని సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు. దాంతో కార్యకర్తలకు నమస్కారం పెట్టి ‘ప్లీజ్ నన్ను సీఎం’ అనొద్దని బండి సంజయ్ కోరారు. ఈ క్రమంలోనే ఓ కార్యకర్త బండి సంజయ్ చేయి పట్టుకుని ముద్దులు పెట్టాడు. మీరు కలకాలం బాగుండాలని బండి సంజయ్ ని కోరాడు. నాలుగు రోజుల క్రితం పార్టీ హైకమాండ్ బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. కిషన్ రెడ్డికి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పార్టీ కార్యకర్తలంతా అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.













Updated : 7 July 2023 8:24 AM IST
Tags:    
Next Story
Share it
Top