Telangana BJP: తెలంగాణ ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ
X
తెలంగాణలో ఎన్నికల సందడి నెలకొంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. బీఆర్ఎస్ ఇప్పటికే తొలివిడత అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థుల వేటలో తలమునకలయ్యాయి. మొన్నటి మోదీ సభతో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఎన్నికల ముందు కీలక హామీలను అమలు చేసింది. ఈ క్రమంలో 14 ఎన్నికల కమిటీలను బీజేపీ ప్రకటించింది.
స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మేనిఫెస్టో కమిటీ చైర్మన్ - వివేక్ వెంకటస్వామి,
మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ - మహేశ్వర్ రెడ్డి
పబ్లిక్ మీటింగ్స్ కమిటీ చైర్మన్ - బండి సంజయ్
ఛార్జ్షీట్ కమిటీ చైర్మన్ - మురళీధర్ రావు
మీడియా కమిటీ చైర్మన్ - రఘునందన్ రావు
ఆందోళనల కమిటీ చైర్మన్ - విజయశాంతి
సోషల్ మీడియా కమిటీ చైర్మన్ - అర్వింద్
ఈసీ వ్యవహారాల కమిటీ చైర్మన్ - మర్రి శశిధర్ రెడ్డి
కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ : ఇంద్రసేనారెడ్డి
కాగా ఇవాళ బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ తెలంగాణకు వస్తున్నారు. రేపు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై నడ్డా రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు.